Valentine Day  Special : నిజమైన ప్రేమ.. ఎక్కడ.. ఎలా ఉంటుంది.. 

Valentine Day  Special : నిజమైన ప్రేమ.. ఎక్కడ.. ఎలా ఉంటుంది.. 

ప్రేమించి పెళ్లిచేసుకోవడమే ప్రేమకు పరమార్ధమా? కానేకాదు.!ప్రేమ పెళ్లి కుదరకపోతేనేం? పెళ్లి ప్రేమలు ఉన్నాయిగా,పెళ్లి చేసుకుని కూడా ప్రేమించొచ్చు.. ఇంకా చెప్పాలంటే ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఇలాంటి భార్యాభర్తలే ప్రేమికులకు పెళ్లి లక్ష్యమైతే.. దంపతులకు ప్రేమ గమ్యం.. ప్రేమ కథలనగానే లైలా మజ్ను, దేవదాసు పార్వతిల విఫల ప్రేమకథలే కాకుండా విఫలమయ్యాక కూడా సంతోషంగా లైఫ్ చేసేవాళ్ల కథలు కూడా ఉన్నాయి.

"నాకు కూడా అందరిలాగానే కాలేజ్ రోజుల్లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. కానీ రాను రాను లైఫ్ లాంగ్ ఇలాగే కలిసి ఉంటే బాగుంటుందనిపించింది. అలా ఫైనల్ ఇయర్ కి వచ్చాక పెళ్లి చేసుకుందామని డెసిషన్​ కు వచ్చాము. తీరాచూస్తే అప్పుడు కాస్ట్, రెలిజియన్ అడ్డొచ్చాయి. అప్పటిదాకా మేము మా కులం ఏంటి, మతం ఏంటి అనేది కూడా. ఆలోచించలేదు. పెళ్లి చేసుకోవాలంటే ఇవి కూడా చూస్కోవాలి అని అప్పుడు తెలిసింది. 

ఒప్పించడానికి ప్రయత్నించినా ఒప్పుకోరని అర్థమైంది. చేసేదేమి లేక అలాగే ఉండిపోయాం.. తర్వాత ఆమెకు పెళ్లి అయిపోయింది. తనని మర్చిపోవడానికి బాగానే టైం పట్టింది. ఆరేళ్ల తర్వాత నేను కూడా పెళ్లి చేసుకున్నా చేసుకోబోయే భార్యకి ఇదంతా చెప్పా. చెప్పకుండా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తను కూడా అర్ధం చేసుకొని, పాజిటివ్ గానే తీసుకుంది. పైగా ఇదంతా జరిగి ఆరేళ్ళు గడిచిపోయింది. ఇప్పుడు నేను చాలా హ్యపీగా ఉన్నా, దాని ప్రభావం ఏ మాత్రం లేదు. ఒకవేళ నా భార్యకు నా మీద ప్రేమలేకపోతే అప్పుడు తాను గుర్తొచ్చేదేమో కానీ నేను ఈ విషయంలో చాలా అదృష్టవంతుడేని తమకు నేనంటే చాలా ఇష్టం లవ్ ఫెయిల్ అవ్వడం చాలా సహజం.  కాని అక్కడితో అన్నీఅయిపోవు.  పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ ఉంటుంది అన్నాడు ఫణీంధ్ర

ఎక్కడైనా.. ఎప్పుడైనా..

ఇంకొకతన్ని అడిగితే ప్రేమ ఎక్కడైనా పుట్టొచ్చు. ఎప్పుడైనా పుట్టొచ్చు అంటున్నాడు. నేను హైదరాబా లో  జాబ్ చేస్తున్నా చదువుకునే రోజుల్లో ఒకమ్మాయిని లవ్ చేశా, తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. మా ప్రేమ నాలుగేళ్లు సాగింది. సాధారణంగా టాప్ స్టోరీస్ 'క్లైమ్యాక్స్ పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. మాది కూడా అలాగే సక్సెస్ అయ్యి శుభం కార్డు వేయించుకుంటుంది అనుకున్నా, కానీ అలా జరగలేదు. సినిమాల్లో లాగా పెద్దలే అడ్డొచ్చారు. మా ఇంట్లో ఒప్పుకున్నారు కానీ, వాళ్ల ఇంట్లో మాత్రం ఒప్పించలేక పోయా. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లిచేసుకుందాం అనుకున్నాం. కానీ ఎక్కడో ఒక చిన్న సెంటిమెంట్ అడ్డొచ్చింది.. తల్లిదండ్రులను ఎందుకు ఇబ్బంది పెట్టాలే అని ఆగిపోయాం. ఇదంతా జరిగి ఒక మూడేళ్లు అయింది. ఇప్పుడు తను పెళ్లి చేసుకొని హ్యాపీ గానే ఉంది. ఆమె హ్యాపీగా ఉంటే చాలు నాకు. నేను కూడా అంతా మర్చిపోయి. ఇప్పుడు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నా. 

►ALSO READ | Vastu Tips:  ఆర్థిక ఇబ్బందులకు ఇంటి ముఖద్వారం కారణమా.. గర్భవతులు గృహప్రవేశం చేస్తే నష్టాలొస్తాయా?

షాకవ్వకండి ఇప్పుడు లవ్ చేస్తుంది నా భార్యని రీసెంట్ గానే నాకు  కూడా పెళ్లి అయింది నా భార్యకు కూడా నా లవ్ స్టోర్ సంగతి తెలుసు. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ లేదు. అదంతా ఒక స్వీట్ మెమొరీ అంతే. ప్రేమ ఒక్కసారే పుడుతుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇలాంటి మాటలు ఎవరైనా అంటే నన్ను చూపించండి. నా దృష్టిలో ప్రేమ ఎక్కడైనా పుట్టొచ్చు. ఎప్పుడైనా పుట్టొచ్చు.
అన్నాడు ఉదయ్

అలా అనిపిస్తుందంతే...

బీహెచ్ఈఎల్ లో అకౌంటెంట్ గా పని చేస్తున్న సుప్రియకు తన ఫాస్ట్ లవ్ స్టోరీని తలచుకుంటే నవ్వొస్తుందంట."మాది ఎరేంజ్డ్ మ్యారేజ్. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో గడిపేది కొద్ది సమయమైనా చాలా సరదాగా ఉంటాం. ఇంట్లో మా పిల్లల గోల కంటే గోలే ఎక్కువగా ఉంటుంది. ఇక పెళ్ళికి ముందు ఆయనకైతే ఎలాంటి లవ్ స్టోరీస్ లేవు. నాకు మాత్రం ఒక చిన్న స్టోరీ ఉంది. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా సీనియర్ తో మొదటిసారి ప్రేమలో పడ్డా. తను మా స్కూల్ టాపర్. రోజూ బాగానే మాట్లాడుకునే వాళ్ళం కానీ ఇంటర్​ కు  తను చెన్నై వెళ్ళిపోయాడు.


నాకు ఫోన్ చేయడం కూడా మానేసాడు. నేనే రోజూ ఫోన్ చేసి ఎందుకు నన్ను వదిలేస్తున్నావు.. అని ఏడిచేదాన్ని.. అయినా నన్ను పట్టించుకునే వాడు కాదు.  దాన్నేతలుచుకుని రోజూ ఏడ్చేదాన్ని. నా జీవితం అయిపోయిందనుకుని తెగ ఫీల్ అయ్యేదాన్ని, అవన్నీ తలచుకుంటే ఇప్పుడు నవ్పొస్తుంది. 

నిజానికి అసలు అదంతా ప్రేమే కాదు. ఏదో ఆ వయసులో అలా అనిపిస్తుందంతే. ఉద్యోగరీత్యా మేము ఫ్యామిలీతో గడిపేది వారానికి ఒకరోజు అయినప్పటికీ మా మధ్య మంచి సంబంధం కొనసాగుతూ, ఒకరినొకరు అభిమానించుకుంటూ ఉంటున్నామంటే దానికి కారణం ప్రేమే కదా! అందుకే కలిగే ప్రేమల్ని నమ్మలేము అని ఎంతవరకు నిజమో" అన్నారు. సుప్రియా వరప్రసాద్

మళ్లీ చిగురిస్తుంది

అదీ సంగతి! ప్రేమ పెళ్లి కుదరనంత మాత్రాన చింతించాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా ప్రేమ చిగురిస్తుంది. టీనేజీలో కలిగే ప్రేమకంటే పెళ్లి తర్వాతే కలిగే ప్రేములోనే త్యాగం, సరుకుపోయే తత్వం లాంటివి ఉంటాయి. ఎవరైనా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలంటే వ్యక్తిత్వాలు, అభిరుచులు ఒకేలా ఉండాలని కోరుకుంటారు.


కానీ మనకు కావాల్సిన అభిరుచులు కేవలం ఒక్కరిలోనే ఉండవు కదా. సరైన సమయంలో సరైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి అడుగు పెట్టొచ్చు. ఇప్పటి వరకు ఎదురుచూస్తే సరి. అంతే తప్ప జరిగినదానికి బాధపడుతూ మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు ప్రేమపై గౌరవం లేనట్టే ప్రేమికులు నాశనం కావాలని ప్రేమ కోరుకోరు కదా..!